చాలా విషయాలలో నిమ్మదిగా వ్యవహరించే వ్యక్తిత్వం కలవాడు అక్కినేని నాగచైతన్య. మీడియా ముందు కూడా మాట్లాడడానికి పలుమార్లు సిగ్గుపడ్డ సందర్భాలు కూడా వున్నాయి
కానీ ఎప్పుడైతే ఈ యువ హీరో ట్విట్టర్ లో అడుగుపెట్టాడో అప్పటినుండి తన ఆలోచనలను చాలా ఆనందంగా తన అభిమానులకు పంచుతున్నాడు
తనకు మనం సినిమా ఒక చిత్రం కంటే ఎక్కువ అని, తాత గారితో కలిసి నటించేందుకు, నేర్చుకునేందుకు అవకాశం ఇచ్చిన చిత్రమని. ఎప్పటికీ ఆ క్షణాలు గుర్తుంటాయని. మీకు ట్రైలర్ నచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపాడు
ఈ సినిమా మొదటి ట్రైలర్ నిన్నే విడుదలైంది. కళ్ళను కట్టిపడేసే విజువల్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. మే లో ఈ సినిమా మనముందుకు రానుంది