13న విడుదల కానున్న ‘ప్యార్ మే పడిపోయానే’ పాటలు

13న విడుదల కానున్న ‘ప్యార్ మే పడిపోయానే’ పాటలు

Published on Apr 8, 2014 5:28 PM IST

Pyar-Mein-Padipoyane-Poster

ఆది, శాన్వీ జంటగా నటిస్తున్న ‘ప్యార్ మే పడిపోయానే’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర యూనిట్, ఈ నెల 25న సినిమా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ఆడియోని ఈ నెల 13న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు.

రవి కుమార్ చావాలి దర్శకత్వం వహించిన ఈ సినిమాని కె కె రాధా మోహన్ నిర్మిస్తున్నారు. ఈ మ్యూజికల్ లవ్ స్టొరీలో, ఆది ఒక సంగిత దర్శకుడి పాత్రలో కనబడనున్నారు. అనూప్ రుబెన్స్, ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

తాజా వార్తలు