నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా భారీ శాటిలైట్ రైట్స్ కి అమ్ముడు పోయింది. మేము విన్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ సుమారు 6 కోట్లకి అమ్ముడు పోయాయి.
ఈ సినిమా విడుదలై ఇది రెండవ వారం అయినప్పటికీ విడుదలైన అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అలాగే బాలకృష్ణ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు వారాహి చలన చిత్రం సమర్పణలో నిమించిన ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు.