గ్లామరస్ డోస్ పెంచిన శృతి హాసన్

గ్లామరస్ డోస్ పెంచిన శృతి హాసన్

Published on Apr 6, 2014 11:47 AM IST

Shruti-Haasan-(6)

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో స్క్రీన్ మీద గ్లామరస్ రోల్స్ చేయడానికి వెనకాడని హీరోయిన్ శృతి హాసన్ కూడా ఒకరని చెప్పవచ్చు. త్వరలోనే తను నటించిన ‘రేసు గుర్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తన డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో గ్లామర్ డోస్ ని మరింత పెంచిందని సమాచారం.

అలాగే శృతి హాసన్ గ్లామర్ ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్ అవుతోంది. అది కూడా పాటల్లో ఆమె మరింత గ్లామరస్ గా కనిపించనుంది. ఈ సినిమాలో అటు మాస్ మెచ్చే కాస్ట్యూమ్స్ మరియు ఇటు క్లాస్ మెచ్చే కాస్ట్యూమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో సలోని, కిక్ శ్యాం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. అలాగే ఏప్రిల్ 11న ఈ మూవీ రిలీజ్ కానుంది.

తాజా వార్తలు