హైదరాబాద్ తిరిగి వచ్చిన ‘ప్యార్ మే పడిపోయానే’ బృందం

Pyar-Mein-Padipoyane
ఆది, శాన్వి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇటివలే హిమాచల్ ప్రదేశ్ లోని కులూమనాలి లో ఈ జంట పై రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ పాటల చిత్రీకరణతో ప్యాచ్ వర్క్ మినహా చిత్రం షూటింగ్ పూర్తి అయింది.

హైదరాబాద్ తిరిగి వచ్చిన ఈ చిత్ర టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. రవి కుమార్ చావాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె. రాధా మోహన్ నిర్మించారు. ఆది ఒక మ్యుజిషియన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఒక మ్యూజికల్ లవ్ స్టొరీ. “ఈ చిత్రం లో నా లుక్ నా గత చిత్రాలతో పోలిస్తే చాలా భిన్నంగా వుంటుంది. ప్రేక్షకులు మా ఈ చిత్రానికి ఎలా స్పందిస్తారో చూడాలని వుంది ” అని ఆకొన్ని రోజుల క్రితం విలేఖరుల సమావేశం లో ఆది పేర్కొన్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఈ నెలలో విడుదల కానుంది.

Exit mobile version