శ్రీ రామనవమి కానుకగా ‘మనం’ ట్రైలర్

manam

అక్కినేని ఫ్యామిలీ హీరోలైన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా మనం. ఎఎన్ఆర్ చివరి సినిమా కావడంతో ఎంతో ప్రత్యేకంగా తీసుకున్న నాగార్జున ఈ సినిమాని అభిమానులకు సంథింగ్ స్పెషల్ గా అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబందించిన మేకింగ్ వీడియోస్ ని స్వీట్ మెమొరీస్ గా అందించనున్నారు. అందులో మొదటి మెమొరీని రేపు రిలీజ్ చేయనున్నారు, అలాగే ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నారు.

నాగార్జున సరసన శ్రియ సరన్, నాగ చైతన్య సరసన సమంత నటిస్తున్న ఈ బ్యాక్ టు ఫ్యూచర్ కాన్సెప్ట్ మూవీకి విక్రం కుమార్ డైరెక్టర్. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version