రేపటి నుంచి ‘మనం’ స్వీట్ మెమొరీస్

Manam
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. అక్కినేని నాగేశ్వర రావు నటించిన చివరి సినిమా కావడం వల్ల ఈ సినిమా అభిమానులకి చాలా స్పెషల్ గా ఉండేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ప్రమోషన్స్ విషయాలు కూడా నాగార్జున దగ్గరుండి చూసుకుంటున్నాడు.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రేపు స్వీట్ మెమొరీస్ పేరుతో ‘మనం’ సినిమాకి సంబందించిన ఒక మేకింగ్ వీడియోని రిలీజ్ చేయనున్నారు. దీని కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బ్యాక్ టు ఫ్యూచర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున సరసన శ్రియ సరన్, నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్స్ గా నటించారు.

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిమిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ అందించాడు.

Exit mobile version