పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మే నుండి విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించనున్న ‘ఓ మై గాడ్’ రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. మే లో జనరల్ ఎలక్షన్స్ పూర్తైపోతాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమాలకు సంబందించిన రెగ్యులర్ షూట్ మొదలు పెట్టనున్నారు.
అలాగే గబ్బర్ సింగ్ 2 కూడా లిస్టులో ఉంది. అది కూడా మరి కొద్ది నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ మరో సినిమాకి కమిట్ అవ్వలేదు. ‘ఓ మై గాడ్’ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రని పవన్ పోషించనున్నాడు.