మణిరత్నం తదుపరి సినిమాపై గతకొన్ని నెలలుగా రకరకాల కధనాలు ప్రచారమవుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు, నాగార్జున, ఐశ్వర్య రాయ్, శృతిహాసన్ వంటి ప్రముఖులతో
వుంటుంది అనగానే చిత్రం పై ఆసక్తి నెలకొంది. డేట్ లు సర్డుబాటుకాక మహేష్ ఈ ప్రాజెక్ట్ ని వదులుకున్నాడు అని వార్తలు వచ్చినా మణిరత్నం సతీమణి
అవన్నీ కేవలం పుకార్లని తెలిపింది
ఒక ఇంటర్వ్యూలో సుహాసిని ఈ సినిమాలో ఆ నలుగురికి ప్రధాన పాత్రలు వున్నాయని, తమిళ మరియు తెలుగు భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తామని తెలిపింది. ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్ గా వుంటుందని, జూన్ నుండి
షూటింగ్ లో నిమగ్నమై వుంటామని చెప్పుకొచ్చింది. . వీరే కాక కొంతమంది ఇరానీ ఆర్టిస్ట్ లను, పాకిస్తాన్ ఆర్టిస్ట్ లను తీసుకుంటామని సుహాసిని చెప్పింది
అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రాజెక్ట్ అతి తక్కువ సమయంలో స్టార్ క్రేజ్ ని దక్కించుకుంటుంది. కేవలం కాంబినేషన్ ని వాడుకుని ఈ సినిమా ప్రచారంలో దుసుకుపోవచ్చు అని ఒక అంచనా.
మరి ఇవన్నీ ఎంతవరకూ నిజమవుతాయో చూద్దాం