బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన హృదయకాలేయం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. స్టీవెన్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ఈ వారాంతరంలో
మనముందుకు రానుంది. తూర్పు గోదావరి జిల్లాలో తప్ప మిగిలిన అన్ని చోట్లా బిజినెస్ ముగిసిందని నిర్మాత సాయి రాజేష్ తెలిపాడు
“తూర్పు గోదావరి తప్ప మిగిలిన ప్రాంతాలలో బిజినెస్ క్లోజ్ అయ్యింది.. మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యవాదాలు” అని ఫేస్ బుక్ పేజ్ లో పెట్టారు
ఈ సినిమా నుంచి భయంకరమైన కామెడిని ఆశించవచ్చని సంపూ మనకు చాలా సార్లు చెప్పుకొచ్చాడు.