జగపతి బాబుకి బాలీవుడ్ ఆఫర్స్.!

Jagapathi-babu-in-Legend
ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న హీరో జగపతి బాబు. జగపతి బాబు నటనలో మరో అడుగు ముందుకు వేస్తూ చేసిన ప్రయోగమే విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించడం. జగపతి బాబు విలన్ గా నటించిన ‘లెజెండ్’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకి పోటా పోటీగా అతను చేసిన నటనకి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు.

ఇటీవలే జగపతి బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు మొదటి రోజు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే చాలా ఆఫర్స్ వస్తున్నాయి. షాకింగ్ విషయం ఏమిటంటే బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయని’ అన్నాడు.

టాలీవుడ్ మరో హీరో బాలీవుడ్ లో మెరిసే అవకాశం ఉందేమో అనేది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

Exit mobile version