సినిమా భవిష్యత్తు పై పెదవి విప్పిన పవన్

pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివలే తన ‘జనసేన’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే తన ఉపన్యాసాలతో అభిమానులను అక్కట్టుకున్న పవన్ కు, ప్రశంసలతో పాటు అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. తను పార్టీ స్థాపించిన తరువాత మొదటిసారిగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా విషయాలపై మాట్లాడారు.

ఇందులో భాగంగా, పవన్ తన సినీ భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు చెప్పారు. మీరు ఇక సినిమాలకు స్వస్తి చెప్తారా అని అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇస్తూ, ‘ఇదివరకు నేను వంద రోజులు పనిచేసే వాణ్ణి, అయితే ఇప్పుడు నేను నా పార్టీ కార్యక్రమాలు కూడా చూసుకోవాలి కాబ్బట్టి కేవలం 50 రోజులు మాత్రమే సినిమాలకు కేటాయించ్చగలుగుతాను’ అని అన్నారు.

రాజకీయాలలో చేరారు ఇక పవన్ సినిమాలు చేస్తాడో లేదు అని చూస్తున్న అభిమానులకు, ఈ వార్త సంతోశాన్ని ఇవ్వబోతుంది. ఈ ఇంటర్వ్యూలో పవన్ వివధ పార్టీలపై, నాయకుల అక్రమాల పై కూడా మాట్లాడారు.

Exit mobile version