పద్మ భూషణ్ అవార్డు అందుకున్న కమల్ హాసన్

kamal-haasan

కొద్ది రోజుల క్రితమే పద్మ అవార్డ్స్ లో భాగంగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కి పద్మ భూషణ్ అవార్డుని ఖరారు చేసారు. ఈ అవార్డుని ఈ రోజు ఆయన ఢిల్లీలో ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకున్నారు.

కమల్ హాసన్ 1990లో పద్మ శ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో బాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ కూడా పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు. ఈ అవార్డుతో చాంపియన్ గోపీచంద్ కి నూతన ఉత్సాహాన్ని అందించారు. అలాగే బాలీవుడ్ నటి విద్యా బాలన్ కూడా పద్మ శ్రీ అవార్డును అందుకున్నారు.

కమల్ హాసన్ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ కి చెందినా మరో 7 గురు పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ని అందుకున్నారు. ప్రస్తుతం కమల్ నటించిన విశ్వరూపం 2 సినిమా విడుదలకి సిద్దమవుతుండగా, కమల్ ప్రస్తుతం ఉత్తమ విలన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Exit mobile version