ఝానవిని సౌత్ లో లాంచ్ చేయనున్న శ్రీ దేవి

sridevi-jhanvi-kapoor

ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీ మరియు అటు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుతం శ్రీ దేవి తన పెద్ద కుమార్తె ఝానవి కపూర్ ని హీరోయిన్ గా లాంచ్ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటోంది.

గత కొంత కాలం నుంచి ఈ వార్త ప్రచారంలో ఉన్నప్పటికీ తాజాగా అది ఖారారు అయ్యింది. శ్రీదేవి తన కుమార్తెను తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం ఫేమస్ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహార్ ఝానవిని బాలీవుడ్ లో లాంచ్ చేయనున్నాడు. కానీ ఎప్పుడు, ఏ సినిమా అనేది మాత్రం ఇంకా తెలియలేదు.

ప్రస్తుతం తన స్టడీస్ ని పూర్తి చేసే పనిలో ఉన్న ఝానవి త్వరలోనే తన లాంచ్ సినిమా కోసం ట్రైనింగ్ మొదలు పెట్టనుంది. అన్ని భాషల్లోనో తన కూతురుని లాంచ్ చేస్తే ఒక్క భాషలో అన్నా సక్సెస్ అందుకుంటుంది అని ఆశిస్తున్న శ్రీదేవి కల నెరవేరాలని ఆశిద్దాం..

Exit mobile version