సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ రిలీజ్ డేట్

Rey
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో చేసిన మొదటి సినిమా ‘రేయ్’. ఈ సినిమా రెండు, మూడు సంవత్సరాల క్రితమే షూటింగ్ ప్రారంభమైంది, షూటింగ్ పూర్తి 6 నెలలు పైన అవుతున్నా సినిమా మాత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

మేము కొద్ది రోజుల క్రితం రేయ్ ఎలక్షన్స్ తర్వాత వస్తుందని తెలియజేశాం. మేము చెప్పినట్టు గానే ఈ సినిమాని మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెలిపారు. చాలా రోజుల నుంచి సరైన రిలీజ్ డేట్ చూసి రిలీజ్ చెయ్యాలనుకుంటున్న వైవిఎస్ చౌదరి ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఫిక్స్ అయ్యాడు

శ్రద్ధ దాస్, సయామీ ఖేర్ హీరోయిన్స గా నటిస్తున్న ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. కరేబియన్ దీవుల్లో, యుఎస్ లో షూట్ చేసిన ఈ సినిమాపై వైవిఎస్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

Exit mobile version