విడుదల రేసులో ‘రేసు గుర్రం’

race-gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసు గుర్రం’ ఏప్రిల్ 11న భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ చిత్ర టీం కచ్చితంగా విజయం సాధించే సినిమా తమ చేతిలో ఉందని చాలా నమ్మకంగా ఉన్నారు, అలాగే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు.

ఈ సినిమాపై ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఉంది. అలాగే అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై బాగా ఆశలు పెట్టుకున్నాడు. సినిమాలో యాక్షన్ తో పాటు హై ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అంటున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం అందించిన ఈ సినిమాలో శృతి హాసన్, సలోని హీరోయిన్స్ గా కనిపించనున్నారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి నిర్మాత.

Exit mobile version