నవదీప్ నటించిన ‘నటుడు’ పాటల విడుదల

natudu
నవదీప్ త్వరలో ‘నటుడు’ అనే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ లో కనిపించనున్నాడు. రమేష్ బాబు కొప్పుల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎన్ఎస్అర్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. నవదీప్ సరసన కావ్య శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా టీజర్ మరియు ఆడియో హైదరాబాద్ శనివారం ఉదయం విడుదల చేశారు. ఒక కాసనోవా పాత్రలో నటిస్తున్న నవదీప్ తన పాత్ర గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో తన పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఉంటాయి అని చెప్పాడు. ఇంతకుముందు, తను ఎన్టిఅర్ నటించిన ‘బాద్ శా’ సినిమా లో నెగెటివ్ పాత్ర లో కనిపించాడు. జయసూర్య సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఈ వేసవిలో నవదీప్ మరో సినిమా ‘నాకు అంత్త సీన్ లేదు’ అనే చిత్రంలో కూడా కనిపియనున్నాడు. ఈ క్రైం కామెడీ సినిమా లో శశాంక్, రేయన మల్హోత్రా మరియు అంకిత మహేశ్వరీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని పూర్తిగా రాత్రి పుట హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో చిత్రీకరించారు.

Exit mobile version