నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు లెజెండ్ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. కొన్ని కట్స్ విధించిన సెన్సార్ వారు సినిమాలో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడం వల్ల ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారని సమాచారం.
బాలకృష్ణ రెండు పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే, ఆ సినిమాకు మించిన అంచనాలు లెజెండ్ పై ఉన్నాయి. బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగపతి బాబు నటించాడు.
వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ మాస్ ఎంటర్టైనర్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ నెల 28న అత్యంత భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది.