తన సినిమాలలో స్టైల్ అంశం ఏ మాత్రం తగ్గకుండా చూసుకునే నటుడు అల్లు అర్జున్. ప్రతీ సినిమాలో ఏదో ఒక కొత్త లుక్ తో మనల్ని పలకరించి స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు స్సంపుర్ణ న్యాయం చేస్తున్నాడు. నిజానికి ఇద్దరమ్మాయిలతో సినిమాలో తన లుక్ కోసం దాదాపు 60 కాస్ట్యూమ్ లు మార్చి ఫోటో షూట్ చేసాడట
తాజా సమాచారం ప్రకారం రేస్ గుర్రం సినిమాకు కూడా అదే రేంజ్ లో కష్టపడతున్నాడట. చాలా సహజమైన పాత్రలో కనబడుతున్నా అవేమి అల్లు బాబుని ఆపలేకపోతున్నాయి. అతని స్టైలిష్ట్ భాస్కర్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ హాంకాంగ్ నుండి కొన్ని పరికరాలు, ఇటలీ, లండన్ నుండి కాస్ట్యూమ్ లను తెప్పిస్తారని, దాదాపు దుస్తులకోసమే చాలా ఖర్చు చేస్తాడని తెలిపారు
సురేందర్ రెడ్డి దర్శకుడు. థమన్ సంగీత దర్శకుడు త్వరలో ఈ సినిమా మనముందుకు రానుంది