మరో హిందీ సినిమాను అంగీకరించిన శృతిహాసన్

shruti-haasan1

బాలీవుడ్ లో శృతిహాసన్ మరో పెద్ద ప్రాజెక్ట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ వెల్కం బ్యాక్, గబ్బర్ సినిమాలలో నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం శృతి తిన్గ్మాన్షు ధులియా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు బిచ్చ్ డే సభీ బారి బారి అనే టైటిల్ ని నిశ్చయించారు. ఇర్ఫాన్ ఖాన్, మనోజ్ భాజ్ పై, అమిత్ సాద్ మరియు విద్యుత్ ప్రధానపాత్రధారులు

35ఏళ్ళ వ్యవధిలో సాగనున్న ఈ సినిమాలో శృతిహాసన్ కు వైవిధ్యమైన పాత్రలు వేసే అవకాశం వుంది. ఇర్ఫాన్ ఖాన్, మనోజ్ భాజ్ పై లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా వుందని తెలిపింది. గతంలో ఈ దర్శకుడు పాన్ సింగ్ తొమర్, సాహిబ్ బీవి ఔర్ గ్యాంగ్స్టర్ వంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. గతంలో ఈ భామ ‘డి డే’ సినిమాలో నటించి మంచి ప్రశంసలను అందుకుంది.

తెలుగులో ఈ భామ రేస్ గుర్రం సినిమాలో అల్లు అర్జున్ సరసన కనిపించనుంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. త్వరలో ఈ సినిమా మనముందుకు రానుంది

Exit mobile version