శ్రియ శరణ్ మరోసారి దక్షిణాదిన తన మార్కు ముద్రను వేయడానికి నిమ్మదిగా అడుగులువేస్తుంది. ఈ భామ ఇటీవలే బాలకృష్ణ తనతదుపరి చిత్రంలో నటించే అవకాశాన్ని మరియు ఒక మలయాళ చిత్రాన్ని వదులుకుందని వార్తలు వినిపించాయి
ఇప్పుడు అమీర్ సరసన ఒక తమిళ చిత్రంలో నటిస్తుందని సమాచారం. అమీర్ గతంలో పరుత్తివీరన్ మరియు ఆది భగవాన్ వంటి సినిమాలు తీసాడు. ఈ కొత్త సినిమాకు అమీర్ నిర్మాణం వహించడం విశేషం. ఈ చిత్రానికి కార్తీక్ దర్శకుడు. ఈ సినిమాను తెలుగులో కూడా తీస్తానని, దానికి పెద్ద హీరోలను సంప్రదించనున్నానని దర్శకుడు తెలిపాడు
త్వరలో శ్రియ మనం సినిమాలో నాగార్జున సరసన కనిపించనుంది. ఈ సినిమాలో నాగేశ్వరరావు, నాగ చైతన్య, సమంత ప్రధాన పాత్రధారులు