తాజా సమాచారం ప్రకారం లక్ష్మి మంచు నటించిన చందమామ కధలు సినిమా మార్చ్ 21న విడుదలకావడం లేదు. ముందుగా ఈ సినిమాను మార్చ్ 14న మనముందుకు తీసుకొద్దాం అనుకున్నా సరిపడినన్ని థియేటర్లు దొరకక విడుదలవాయిదా వేసారు. చాణుక్య నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు తెరకెక్కించాడు
ఈ సినిమా ఏప్రిల్ 2వ వారంలో విడుదలకానుందని ఇప్పుడు దర్శకుడు తెలిపాడు. “ఈ చందమామ కధలు 5ఏళ్ళ నుంచి 60ఏళ్ళ వరకూ ప్రతీఒక్కరూ చూడవలిసిన కధ కాబట్టి చాలా తర్జనబర్జన పడిన తరువాత ఈ సినిమాను ఏప్రిల్ 2వ వారంలో విడుదలచెయ్యాలని నిర్ణయించాం” అని పేర్కున్నాడు
ఈ సినిమాలో చైతన్య కృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, అభిజీత్, షామిలి, ఇషా, కిషోర్ మరియు రిచా పనై ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతదర్శకుడు