పవన్ రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గతకొన్ని రోజులుగా నటులు, సినిమా ప్రముఖులు పవన్ రాజకీయ ప్రవేశం సరైనదా కాదా అన్నదానిపై వారివారి అభిప్రాయాలు తెలుపుతున్నారు
ఇప్పుడు ఈ జాబితాలోకి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జయసుధ కూడా చేరారు. ఆమె పవన్ ఆలోచనపై తన అభిప్రాయం తెలుపుతూ “ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా సమాజానికి సేవ చెయ్యవచ్చు. మనం వారిని స్వాగతించాలి. వ్యక్తిగతంగా పవన్ రాజకీయాలలోకి రావడం నాకు ఇష్టమే. ఆయన ఈ పని పి.ఆర్.పి ని కాంగ్రెస్ లోకి విలీనం చేసినప్పుడే చేసి వుంటే బాగుండేది. ఇప్పుడుకూడా ఏమి మించిపోలేదు. అతను గెలిచినా, ఓడినా సమాజానికి మంచి చేయాలనుకోవడం న్యాయమైన ఆలోచన. నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఆయనలో వున్నాయి” అని పేర్కొన్నారు
పవన్ పొలిటికల్ మీట్ కి కావలిసిన ఏర్పాట్లన్నీ ఒకవైపు శరవేగంగా సాగుతున్నాయి. భారీగా తరలిరానున్న ఈ ప్రెస్ మీట్ లో పవన్ ఏం చెప్తాడో చూడాలి