అనుకోని పొగడ్తలకు పొంగిపోతున్న ఛార్మీ

charmi1
ఛార్మీ నటనా ప్రాధాన్యమున్న పాత్రలు చేసి చాలారోజులవుతుంది. ‘అనుకోకుండా ఒక రోజు’, ‘మంత్ర’ సినిమాలలో అటువంటి పాత్రలు చేసి విజయం సాధించినా ఆ తరువాత కేవలం ప్రత్యేక పాటలకు, గ్లామర్ పాత్రలకు పరిమితమయింది

ఇటీవలే ఒక దర్శకుడు ఛార్మీకి చెప్పిన విషయాన్ని తలుచుకుని ఈ భామ తెగ ఉప్పొంగిపోతుందట. అతను దాదాపు 30మంది అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి వారిని మీకు స్పూర్తి నింపిన పాత్ర ఏమిటి అంటే చాలామంది అనుకోకుండా ఒక రోజు సినిమాలో ఛార్మీ పాత్ర అన్నారట. ఈ వార్త విన్న చార్మీ ఆనందానికి అవధులు లేవట

త్వరలో ఈ భామ తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన ప్రతిఘటన సినిమాలో విలేఖరి పాత్రలో కనిపించనుంది

Exit mobile version