ఖరారైన బాలకృష్ణ ‘లెజెండ్’ ఆడియో వేదిక

legend1
నందమూరి బాలకృష్ణ హీరోగా హీరోగా నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా ఆడియో మార్చి 7న భారీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే, కానీ ఆ కార్యక్రమానికి వేదిక ఎక్కడ అనేది మాత్రం ఇంకా చెప్పాలేదు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ‘లెజెండ్’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం మార్చి 7న ఆడియో లాంచ్ చాలా గ్రాండ్ గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్ర ఆడియో రైట్స్ ని లహరి మ్యూజిక్ వారు భారీ ప్రైజ్ కి సొంతం చేసుకున్నారని ఇది వరకే తెలియజేశాం. బాలకృష్ణ రెండు పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా జగపతి బాబు కనిపించనున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు కలిసి నిర్మంచారు.

Exit mobile version