నీతూ చంద్ర ట్విట్టర్ లో రేపిన కామెంట్లు సంచలనాన్ని రేకెత్తించాయి. హీరో రాజశేఖర్ తరచూ తాగి సెట్ లలోకి వస్తారని, గన్ ని కూడా తనతో తెచ్చుకుంటాడని చెప్పుకొచ్చింది ఈ భామ.
తెలుగు సినిమా రంగం, రాజశేఖర్ ప్రవర్తనల పై వరుసపెట్టి ట్వీట్ లను సందించింది. కాసేపటికి ఈ అమ్మడు తన ట్వీట్ లను తొలగించినా అప్పటికే జరగవలిసిన నష్టం జరిగిపోయింది. చాలా మంది సీనియర్ నటులు నీతూ ప్రవర్తనను ఖండిస్తున్నారు.
“నాగార్జున మనం సినిమాతో మరోసారి తెలుగు తెరపై కనిపించనుంది. మరి ఇప్పుడు రాజశేఖర్ గురించి చెప్పవలిసిన అవసరం ఏముంది? ఇప్పటిదాకా మౌనంగా ఎందుకుంది? ఒకవేళ ఈ వార్తే నిజమైతే ప్రతీ ఇండస్ట్రీ లోనూ ఇలాంటి వారు వున్నారుగా.. లేరంటారా?” అంటూ ఒక ప్రముఖ నిర్మాత ప్రశ్నించారు.
ఇప్పటివరకూ జీవిత మరియు రాజశేఖర్ లు ఏమి మాట్లాడకపోయినా ఈ వార్తలను విన్నారని నీతూ ప్రవర్తన తనకు నచ్చలేదని సమాచారం.