తోటి నటుడి ప్రాణాలు కాపాడిన ఇలియానా

Ileana
బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన్న ఇలియానా చిత్రాల ఎంపికలో శ్రద్ధ వహించి మంచి ఫలితాలని అందుకుంటుంది. బర్ఫీ సినిమాతో విమర్శకులను మెప్పించిన ఈ భామ ఆ తరువాత సైఫ్ అలీ ఖాన్ ‘హ్యపీ ఎండింగ్’, కందిరీగ హిందీ వెర్షన్ ‘మైన్ తేరా హీరో’ సినిమాలను ఒప్పుకుంది. షాహిద్ కపూర్ తో నటించిన ఫటా పోస్టర్ నికలా అనుకున్నంత విజయం సాధించలేదు.

గత ఏడాది ‘మైన్ తేరా హీరో’ షూటింగ్ సమయంలో తన సమయస్పూర్తితో తోటి నటుడు వరుణ్ ధావన్ ను కాపాడింది. సమాచారం ప్రకారం వీరిద్దరూ శూతిన్ ఒక సన్నివేశంలో వరుణ్ ట్రామ్పోలీన్ పైన ఎగిరి ఇల్లూ ని అందుకోవాలట. కాకపోతే ఆ పరికరం అంతా తడిగా వుందని అది పూర్తిగా ఆరె వరకూ వేచి వుండమని బృందాన్ని కోరిందట. ఒకవేళ తాను అల చెప్పకపోతే వరుణ్ కి చాలా గాయాలయ్యి వుండేవట.

భామ ఇప్పుడు నర్గీస్ ఫక్రితో స్నేహం చేస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 4న విడుదలకానుంది. త్వరలో ఇలియానా ఎటువంటి సినిమాలు ఒప్పుకుంటుందో చూడాలి మరి.

Exit mobile version