మరోసారి వాయిదాపడనున్న జెండా పై కపిరాజు?

Jendapai-kapiraju1

నాని, అమలా పాల్ నటించిన జెండా పై కపిరాజు సినిమా గతనెల 14న మనముందుకు రావాలి. అయితే అనుకోని కారణాలవల్ల ఈ సినిమా వాయిదాపడుతూ వచ్చింది. ఈ సినిమా వెర్షన్ లో జయం ప్రధానపాత్ర పోషించాడు. ఈ తమిళ వెర్షన్ ను తమిళనాడు అంతటా 7న విడుదల చేయనున్నట్లు తెలిపారు

అయితే జెండా పై కపిరాజు విడుదల గురించి కనీసం ఒక్క వార్త కూడా లేకపోవడం గమనార్హం. అక్కడి పరిస్థితులు చూసి ఆ తరువాత విడుదల చెయ్యచ్చు అన్నది నిర్మాతల అంచనా కావచ్చు. ఎందుకంటే పైసా, ఆహా కళ్యాణం రెండూ పరాజయం పాలయ్యాయి. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. జి.వి ప్రకాష్ సంగీతదర్శకుడు

Exit mobile version