రజినీ కాంత్ సరసన అనుష్క?

rajinikanth-anushka
ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అది కూడా ఇద్దరు సూపర్ స్టార్ గురించి ఒకరేమో హీరో, మరొకరేమో హీరోయిన్.. విషయంలోకి వెళితే.. ఇప్పటికే ‘కొచ్చాడియాన్’ సినిమాను పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీ కాంత్ కెఎస్ రవికుమార్ తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి.

తమిళ్ మీడియా తాజా సమాచారం ప్రకారం కన్నడ నిర్మాత రాక లైన్ వెంకటేష్ ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉంది. ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా కెఎస్ రవికుమార్ స్క్రిప్ట్ కి రజినీ ఓకే చెప్పాడని సమాచారం.

ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ కెఎస్ రవికుమార్, హీరో రజినీ కాంత్ అనుష్క వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇది వరకు ఈ విషయం అధికారికంగా ఖరారు కాలేదు ఇక వేళ నిజమైతే అనుష్క కల నిజమైనట్టే.. చూదాం ఎం జరుగుతుందో..

Exit mobile version