సామాజిక సేవలో తరించనున్న పవన్ కళ్యాణ్

Pawan_Kalyan-10

పవర్ స్టార్ చెయ్యి కలపడంతో వారి అభిమానులు ఒక సామాజిక ఈవెంట్ చేయికలిపారు. ‘వాక్ ఫర్ ది హార్ట్, రీచ్ ఫర్ ది హార్ట్’ అనే కార్యక్రమాన్ని హృదయ స్పందన ఫౌండేషన్ సంస్థ ప్రజాహిత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు శ్రేయాస్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ఈ వేడుకకు హాజరుకానున్నారు

ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. కొన్ని వందల సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నారని అంచనా. గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని చారిటీ వేడుకలలో పల్గున్నా, చాలా చోట్ల ధనసహాయం చేసినా ఎక్కడా పేరు బయటకు రాకుండా చుస్కుంటాడు.

ప్రస్తుతం పవన్ గబ్బర్ సింగ్ 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ వేసవిలో షూటింగ్ ప్రారంభంకానుంది. అంతేకాక వెంకటేష్ తో కలిసి ఓ మై గాడ్ రీమేక్ లో నటిస్తున్నారు

Exit mobile version