తమిళ సినిమా వార్తల కధనం ప్రకారం కమల్ హాసన్ నటించనున్న ఉత్తమ విలన్ సినిమాలో హీరోయిన్ల పాత్రలకోసం ఆండ్రియా మరియు పూజా కుమార్ లను సంప్రదించారట. వీరిద్దరూ కమల్ విశ్వరూపం, దాని సీక్వెల్ విశ్వరూపం 2 లలో నటించారు.
ముందుగా త్రిష, కాజల్, తమన్నా లను సంప్రదించినా వారి డేట్ లు సర్దుబాటుకాక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు సమాచారం. ఇప్పుడు సంప్రదించారన్న వార్తకుడా అధికారికమైన ప్రకటన కాకపోవడంతో త్వరలో ఈ సినిమా బృందం మీడియాతో మాట్లడచ్చని భావిస్తున్నారు. గత ఏడాది ఆండ్రియా తడాఖా సినిమాలో సునీల్ సరసన నటించింది.
రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకుడు. కమల్ ఈ సినిమాలో పలు విభిన్న షేడ్స్ వున్నా పాత్రలో మనల్ని అలరించనున్నాడు. క్రేజీ మోహన్ తో కలిసి స్క్రిప్ట్ పనులను కమల్ పూర్తిచేసాడు. లింగుస్వామి నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషలలో విడుదలకానుంది.