ముంబైకి మకాం మార్చిన తాప్సీ

Taapsee
ఎట్టకేలకు తాప్సీ ముంబైకి మకాం మార్చింది. ఈ భామ డిల్లిలో పుట్టి పెరిగినా గతకొన్నేళ్ళగా తెలుగు సినిమాలు చేస్తూ హైదరాబాద్ లోనే స్థిరపడిపోయింది. గత ఏడాది చష్మే బద్దూర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. త్వరలో రన్నింగ్ షాది డాట్ కామ్ సినిమాలో కనిపించనుంది

ఈ ముంబై మకాం పై తాప్సీ మాట్లాడుతూ “అవును నేను ముంబైకి నా ప్లేస్ మార్చుకుంటున్నా. హైదరాబాద్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇక్క ప్రజలు స్నేహపుర్వంగా నిలుస్తారు. తెలుగులో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో మళ్ళి మిమ్మల్ని కలుస్తాను. ప్రస్తుతానికి నేను అధికారికంగా ముంబై నివాసిని” అని చెప్పింది. ఈ భామ చివరిగా చంద్రశేఖర్ యేలేటి సాహసం సినిమాలొ కనిపించింది. అజిత్ ఆరంభంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది

ప్రస్తుతం తాప్సీ ముని 3 సినిమా నిర్మాణదశలో వుంది. ఈ సినిమాకు రాఘవలారెన్స్ దర్శకుడు. బెల్లంకొండ సురేష్ తెలుగు వెర్షన్ కు నిర్మాత. ఈ సినిమా ఈ ఏడాదిలో మనముందుకు రానుంది.

Exit mobile version