సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తను మ్యూజిక్ అందించిన ‘రేస్ గుర్రం’ సినిమాపై చాలా సంతోషంగా వున్నాడు. ఈ సినిమా పాటల ఆల్బమ్ కు మంచి ఆదరణ లబిస్తుందని ఆయన చాలా నమ్మకంగా వున్నాడు. ఈ సినిమా సంగీతం గురించి థమన్ నిన్న ట్విట్టర్ లో తెలియజేయడం జరిగింది. ఈ సినిమాకు సంబందించిన ఆడియో విడుదల తేదిని ఒకటి లేదా రెండు రోజుల్లో తెలియజేయవచ్చునని తెలిపాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.