పెళ్లి లొల్లి గురించి నోరువిప్పిన కాజల్

Kajal-Agarwal

ముంబైకు చెందిన బిజినెస్ మ్యాన్ తో కాజల్ ప్రేమలో పడిందని అంతేకాక ఈ నెలలో శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజ చేయించి తమ వ్యవహారిక, వ్యక్తిగత జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటుందని పలు పుకార్లు వచ్చాయి. కాకపోతే వాటిని కాజల్ కొట్టిపారేసింది

ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భామ “అమెరికాలో వుండే మా కజిన్స్ కొంతమంది తిరుపతి వెళ్దాం అన్నారు. అక్కడనుండి కాళహస్తి దగ్గరే కాబట్టి వెళ్లివచ్చాం. అంతేగానీ నాకు సినిమాలలో అవకాశాలు లేక, లేదా మంచి పాత్రలు రాక మాత్రం కాదు. అంతేకాదు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలేదు” అని తేల్చిచెప్పేసింది. త్వరలో ఈ భామ కృష్ణ వంశీ, రామ్ చరణ్ ల సినిమా షూటింగ్ లో పాల్గోనుంది

ఇప్పుడు బాలాజీ దర్శకత్వంలో తన తదుపరి తమిళ సినిమా మొదలుకానుంది. ఈ సినిమాలో ధనుష్ హీరో. అన్నీ సక్రమంగా జరిగితే ఈ భామ ఒక హిందీ చిత్రాన్ని సైతం అంగీకరించే సూచనలు వున్నాయి

Exit mobile version