బాహుబలి సెట్స్ ని విజిట్ చేసిన వెంకటేష్

rajamouli-venkatesh1
సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ఓ భారీ వార్ ఎపిసోడ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. బాహుబలి టీంని సర్ప్రైజ్ చెయ్యడానికి విక్టరీ వెంకటేష్ రామోజీ ఫిల్మ్ సిటీలోని సెట్ ని విజిట్ చేసారు. అక్కడే చిత్ర టీంతో కాసేపు గడిపారు. ఆ విషయంలో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

బాహుబలి టీం చేస్తున్న వార్ సీక్వెన్స్ చివరి దశకు చేరుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు. ఆర్కా మీడియా వారునిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, సత్య రాజ్, నాజర్, సుదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version