వెంకీ – పవన్ మూవీ రిలీజ్ డేట్

PAVAN-VENKY

విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించనున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో వెంకటేష్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ గా కనిపించనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ – నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై డి.సురేష్ బాబు – శరత్ మరర్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమా రిలీజ్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు.

Exit mobile version