బర్నింగ్ స్టార్ ‘హృదయ కాలేయం’ ఆడియో రిలీజ్ డేట్

hrudaya_Kaleyam
ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండానే రాష్ట్ర సంపూర్నేష్ బాబు యువత ని క్రియేట్ చేసుకున్న ఘనత ఒక్క బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబుకే దక్కింది. సంపూర్నేష్ బాబు నటించిన ‘హృదయ కాలేయం’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియోని ఫిబ్రవరి 27న హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

సంపూర్నేష్ బాబు సరసన కావ్య కుమార్, ఇషిక సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి సెన్సార్ వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇటీవలే విడుదల చేసిన రెండు సాంగ్ ప్రోమోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఈ రోజుల్లో’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘విల్లా(పిజ్జా 2)’ సినిమాలను మనకు అందించిన గుడ్ సినిమా గ్రూప్ వారి సమర్పణలో సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమాకి స్టీవెన్ శంకర్ దర్శకుడు.

Exit mobile version