వాయిదా పడిన ఎన్.టి.ఆర్ సాంగ్ షూటింగ్?

NTR-and-Samantha
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. అనుకున్న దాని ప్రకారం ఈ రోజు నుంచి ఎన్.టి.ఆర్ – సమంతలపై ఓ పాటని షూట్ చేయాల్సి ఉంది. కానీ అది అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. మరి కొద్ది రోజుల్లో ఈ పాటని షూట్ చేసే అవకాశం ఉంది. సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కందిరీగ శ్రీనివాస్ డైరెక్టర్.

ఎన్.టి.ఆర్ ఈ సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఫుల్ కామెడీ ఉండేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకుంటోంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. మేలో ‘రభస’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version