పూరి, పవన్ కల్యాణ్ ల కెరీర్ నే మలుపుతిప్పిన సినిమా బద్రి . కానీ ఈ సినిమాను కార్యరూపం దాల్చెలా చెయ్యడానికి పూరి పెద్ద గేమ్ ఏ ఆడాడు. దానికి సంబంధించిన కధ ఇటీవలే ఒక ఆడియో విడుదల వేడుకలో పూరి మనకు చెప్పాడు
“బద్రి కధ కాస్త కొత్తగా వుంటుంది. అందరికీ అంతా త్వరగా రీచ్ అవ్వదు. అందుకే నేను ఛోటా కె నాయుడు గారికి ‘ఇట్లు శ్రావణి శుభ్రమణ్యం’ కధనే పవన్ గారితో చెయ్యాలనుకుంటున్నా అని చెప్పి ఆయన వల్ల పవన్ ను కలిసి అప్పుడు పవర్ స్టార్ కు బద్రి కధ చెప్పాను'” అని తెలిపాడు
తనకు పవన్ కు మధ్య విభేదాలు లేవని, అవకాశం వస్తే పవన్ తో సినిమా చేస్తానని తెలిపాడు