‘రభస’ పై వస్తున్న వార్తలను కొట్టి పారేసిన కొరటాల శివ

Koratala-Shiva1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రభస'(వర్కింగ్ టైటిల్). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకి అసలు డైరెక్టర్ అయిన సంతోష్ శ్రీనివాస్ కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ‘మిర్చి’ ఫేం కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. కానీ కొరటాల శివ వాటిని కొట్టి పారేసాడు.

‘ఎన్.టి.ఆర్ రభస మూవీ డైరెక్టర్ ఆరోగ్యం బాలేదని ఆ సినిమాని నేను డైరెక్ట్ చేస్తున్నాను అని వస్తున్న వార్తలు విని షాక్ అయ్యాను. ఆ వార్తలన్నీ ఒత్తి పుకార్లే వాటిల్లో అస్సలు నిజం లేదని’ కొరటాల శివ ట్వీట్ చేసాడు.

ఎన్.టి.ఆర్ సరసన సమంత, శృతి హాసన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. అలాగే మే లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version