బంగారు కోడిపెట్ట రిలీజ్ డేట్

Bangaru-Kodi-Petta-Movie-La
నవదీప్, స్వాతి జంటగా నటించిన బంగారు కోడిపెట్ట సినిమా గత కొన్ని నెలలుగా విడుదల కోసం నిరీక్షిస్తోంది. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా కాలం క్రితమే పూర్తయ్యినప్పటికీ రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ డిసెంబర్ లోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయడానికి ప్రొడక్షన్ టీం సన్నాహాలు చేస్తోంది. గతంలో బోణి సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ పిప్పళ్ళ ఈ మూవీకి డైరెక్టర్. గురు ఫిల్మ్స్ బ్యానర్ లో సునీత తాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేష్ శంకర్ సంగీతం అందించాడు. ఈ మూవీలో తన డ్రీమ్స్ కోసం ఏమన్నా చేసే వ్యక్తిలా కనిపించే పాత్రలో నవదీప్ కనిపిస్తే, స్వాతి బాబ్లీ గర్ల్ పాత్రలో కనిపించనుంది.

Exit mobile version