సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని ముందుగా సమ్మర్ చివర్లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సెప్టంబర్ లో దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ ఆగష్టు చివరి లోపు పూర్తయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో హీరోయిన్ తమన్నా, కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం కూడా పాల్గొంటున్నారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో మరోసారి మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.