నేడే బసంతి ట్రైలర్

basanti
చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ‘బసంతి’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టాడు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆలీషా బైగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని చైతన్య తన సొంత బ్యానర్ అయిన స్టార్ట్ కెమెరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా ట్రైలర్ ని నిన్న ఆగడు సెట్లో మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ లోని థియేటర్స్ లో మరికొద్ది రోజులలో ఈ ట్రైలర్ ని ప్లే చేయనున్నారు. ఈ రోజు ఈ ట్రైలర్ ని టీవీ, ఇంటర్నెట్ లో రిలీజ్ చేయనున్నారు. గౌతమ్ కాలేజ్ స్టూడెంట్ గా, అదే కాలేజ్ లో చదివే అమ్మాయి ప్రేమలో పడే యువకుడిగా కనిపించనున్నాడు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ రోల్ లో కూడా గౌతమ్ కూడా కనిపించనున్నాడు. మణిశర్మ సగీతం అందించిన ఈ సినిమా ఆడియోని త్వరలో రిలీజ్ చేయనున్నారు.

ట్రైలర్ కోసమ్ ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version