కామెడీ బ్రహ్మకు జన్మదిన శుభాకాంక్షలు

Brahmanandam
కామెడీ కింగ్ బ్రహ్మానందానిది పరిచయం అవసరం లేని పేరు. దాదాపు 1000 సినిమాలకు పైగా కనిపించి మనల్ని నవ్విస్తూనే వున్నాడు. ఈ కామెడీ బ్రహ్మ 1956 ఫిబ్రవరి 1న సత్తెనాపల్లిలో పుట్టారు. ఈరోజు ఆయన 58వ జన్మదినం జరుపుకుంటున్నారు

చాలా తెలుగు సినిమాలకు ఇప్పుడు బ్రహ్మానందమే పెద్ద దిక్కు. విభిన్నమైన హావభావాలతో విలక్షణమైన నటనతో మనల్ని ఆకట్టుకుంటున్నారు. ఆయనకు ఉన్నన్ని జి.ఐ.ఎఫ్ ఇమేజ్ లు బహుశా మరే నటుడికీ వుండకపోవచ్చు

1987లో జంధ్యాల తీసిన అహ నా పెళ్ళంట సినిమా ద్వారా మనకు పరిచయమై 90వ దశకం నుండి స్టార్ కమెడియన్ గా రాజ్యమేలుతున్నాడు

123Telugu.com ద్వారా డాక్టర్ బ్రహ్మానందానికి జన్మదిన శుభాకాంకాంక్షలు తెలుపుతున్నాం

Exit mobile version