నాగ చైతన్య ఆటో నగర్ సూర్య విడుదలకు సిద్ధమవుతుంది. దీనికి దేవా కట్టా దర్శకుడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఆటోమోటివ్ ఇండస్ట్రి నేపధ్యంలో తెరకెక్కించారు. నందు ముఖ్యపాత్రధారి. ఆచ్చి రెడ్డి నిర్మాత
ఈ సినిమా మొదటికాపీ ఫిబ్రవరి 3వ తేదీకి సిద్ధమవుతుందని సెన్సార్ పనులు కూడా ఆ వారంలోనే పూర్తవుతాయని తెలిపాడు. ఇన్ని చెప్తున్న ఈ జీనియస్ డైరెక్టర్ రిలీజ్ డేట్ మాత్రం చెప్పట్లేదు. “వచ్చే వారం విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించనున్నారు” అని తెలిపారు. ఫిబ్రవరి 7న ముందుగా ఈ సినిమా విడుదల అని ప్రకటించినా అది అసాధ్యం అని తేలిపోయింది
అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. కొన్ని పాటలు వినసోంపుగా వున్నాయి. శ్రీకాంత్ సినిమాటోగ్రాఫర్.