“టాలీవుడ్ ను వదిలే ఆలోచన లేదు” : కాజల్

kajal-aggarwal
ఎవడు లో తళుక్కున మెరిసిన తార కాజల్ ఆగర్వాల్ తనకు టాలీవుడ్ వదిలే ఆలోచనలు లేవని తెలిపింది. మీడియా ముందు మాట్లాడిన ఈ భామ “నేను ఈరోజు ఇలా వున్నానంటే దానికి తెలుగు ఇండస్ట్రీయే కారణం. నేను ఎప్పటికి ఈ ఇండస్ట్రీ ని వదలను. ఈ ఫీల్డ్ నాకెన్నో మంచి అవకాశాలను అందించింది” అని తెలిపింది

మగధీర, నాయక్ ల తరువాత ఎవడులో రామ్ చరణ్ సరసన మూడవసారి నటించింది. వీరి కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ “చెర్రితో కలిసి నటించడం ఆనందం. ఇప్పుడు కృష్ణవంశీ సినిమాలో మరోసారి జతకట్టనున్నాం. దిల్ రాజు బ్యానర్ లో ఎవడు నా మూడవ సినిమా” అని తెలిపింది. ఈ సినిమాలో అమీ జాక్సన్, శృతిహాసన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకుడు. ప్రస్తుతం ఈ భామ చేతిలో తమిళ, హిందీ సినిమాలు కూడా వున్నాయి

Exit mobile version