ఆ వార్తల్లో నిజం లేదు – కాజల్ అగర్వాల్

kajal
సౌత్ ఇండియాలో బిజీ గా ఉన్న హీరోయిన్స్ లో అందాల భామ కాజల్ అగర్వాల్ ఒకరు. కాజల్ ఈ సంవత్సరం తమిళ్లో జిల్లా పేరుతో ఓ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో తన పాత్రకి మంచి ఆదరణ రావడంతో ఆమె తన ఆనందాన్ని పంచుకోవడానికి కాసేపు పత్రికా మిత్రులతో ముచ్చటించారు.

‘2 సంవత్సరాల క్రితం ఈ కథ విన్నాను. అప్పట్లో నన్ను మెయిన్ హీరోయిన్ గా అనుకున్నారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో నో చెప్పాను. కానీ ఇందులో 10 నిమిషాల పాత్ర చేసాను, ఆ పాత్రకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని’ కాజల్ తెలిపింది.

పారితోషికం విషయంలో తెలుగ సినిమాలు చేయడం లేదని, తమిళ్ మూవీ ప్రమోషన్స్ కి కూడా వెళ్ళడం లేదని మీ పై వార్తలు వస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏంటని అడిగితే ‘ నేను ఎప్పుడూ కమర్షియల్ గా ఆలోచించను. హీరోయిన్ గా నా కెరీర్ మొదలైంది ఇక్కడే కావన తెలుగు సినిమాలకు దూరం కావాలని ఎప్పుడూ అనుకోను. అలాగే మేము నటించే సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనడం మా భాద్యత. తమిళ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని వచ్చే వార్తలు అబద్దం, అందులో నిజం లేదని’ కాజల్ సమాధానం ఇచ్చింది.

Exit mobile version