నా ఇంటికి ఆయన పేరే పెట్టుకున్నాను – చక్రి

chakri
సినిమాల్లోకి రాకముందు ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేసి ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన చక్రి అనతి కాలంలోనే స్వర చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో వరుస విజయాలను, సూపర్ హిట్ సాంగ్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించిన చక్రి ఈ మధ్య కాస్త స్లోగా సినిమాలు చేస్తున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో తన గత స్మృతుల్ని పంచుకుంటూ ‘నాకు బాచి సినిమాతో పెద్ద సినిమా ఆఫర్ ఇచ్చిన పూరి జగన్నాధ్ అన్నయ్య. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత సినిమా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కి మళ్ళీ జగన్ అన్నయ్య నన్ను ఎంచుకున్నాడు. కానీ నిర్మాత్ర మాత్రం వద్దన్నాడు. దాంతో జగన్ అన్నయ్య నన్ను మార్చకుండా నిర్మాతనే మార్చేశాడు. ఆ సినిమా జగన్ అన్నయ్యకి, నాకు, రవితేజకి బ్రేక్ ఇచ్చిన సినిమా. మా అమ్మానాన్నల తర్వాత రుణపడి ఉండేది మాత్రం పూరి అన్నయ్యకే.. అందుకే నా ఇంటికి కూడా పూజ కుటీర్ అని పెట్టుకున్నా. అందరూ పూరి కుటీర్ ఏంటి అనేది అడుగుతుంటారు. పూజ కుటీర్ అంటే పూరి జగన్నాధ్ కుటీర్ అని’ తన చక్రి అనుభవాలను పంచుకున్నాడు.

Exit mobile version