నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి అంతిమయాత్ర ఫిల్మ్ నగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ గారి భొథిక దేహానికి దహన క్రియలు నిర్వహించారు. అక్కినేని కుటుంబ సభ్యులైన నాగార్జున, వెంకట్, సుమంత్, సుశాంత్, నాగ చైతన్య, అఖిల్ కలిసి పాడెపై ఏఎన్ఆర్ ని కాల్చే ప్రదేశం వరకూ తీసుకు వచ్చారు. ఆ తర్వాత అక్కినేని వారసులంతా కలిసి ఆయన భౌతిక దేహానికి చితిని వెలిగించారు.
చివరి నిమిషంలో అక్కినేని నాగార్జున, నాగ సుశీల, వెంకట్, అమల, సుమంత్, నాగ చైతన్య, అఖిల్ తదితరులు శోక సముద్రంలో మునిగిపోయారు. అక్కడే ఉన్న ప్రముఖులు టి.సుబ్బరామి రెడ్డి, దాసరి నారాయణరావు, డి. రామానాయుడు, చిరంజీవి లాంటి వారు అక్కినేని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అక్కినేని నాగేశ్వరరావు దహన కార్యక్రమాలకు వెంకటేష్, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్, అనుష్క, శ్రీ కాంత్, రాజశేఖర్, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.