అంజాన్ షూటింగ్ లో పాల్గొనున్న సమంత

Samantha
విరామం అన్న పదమే ఎరుగకుండా సమంత షూటింగ్ లలో పాల్గుంటుంది. వి.వి వినాయక్ సినిమా గురించి జపాన్ నుండి తిరిగొచ్చిన వెంటనే ఎన్.టీ.ఆర్ రభసలొ చేరింది. సూర్య సరసన ముంబైలో అంజాన్ లో నటిస్తుంది

గతకొన్నిరోజులుగా రభస షూటింగ్ కోసం హైదరాబాద్ లో వున్న ఈ భామ నిన్న ఆటోనగర్ సూర్య ఆడియో రిలీజ్ లో నవ్వుతూ కనువిందుచేసింది. ఇప్పుడు సూర్యతో అంజాన్ కోసం ముంబై పర్యటనకు సిద్ధమవుతుంది. గోవాలో కూడా ఈ సినిమాను తీయనున్నారు. లింగుస్వామి ఈ సినిమాకు దర్శకుడు

అంతేకాక ఈ భామ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో రానున్న రెండో చిత్రంలో నాయికగా ఎంపికైనట్లు సమాచారం. చేతిలో ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలు వున్నాయి కాబట్టి సమంత కు ఈ ఏడాది చాలా ముఖ్యంకానుంది

Exit mobile version